Gold rate: ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు

by Harish |
Gold rate: ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో క్రమంగా పెట్టుబడిదారులు తమ ధోరణిని మార్చుకుంటున్నారు. ఫెడ్ నుంచి రేట్ల తగ్గింపు ప్రకటన వెలువడగానే బంగారంపై పెట్టుబడులను పెంచుతున్నారు. దీంతో శుక్రవారం నాడు బంగారం ధర అంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో $2,600కి చేరుకుంది. ముఖ్యంగా అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి $2,630.00కి చేరుకోగా, వెండి 1.1శాతం పెరిగి $31.12కి చేరుకుంది. వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా పెట్టుబడిదారులు తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉండటంతో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రాబడి ఉంటుందనే భావనతో తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.

స్ప్రాట్ అసెట్ మేనేజ్‌మెంట్‌ మేనేజర్ ర్యాన్ మెక్‌ఇంటైర్ మాట్లాడుతూ, ఫెడ్ నుంచి రేట్ల తగ్గింపు ప్రకటన రాగానే అందరి చూపు బంగారంపై పడింది. ముఖ్యంగా 50 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన ఫెడ్ తర్వాత రోజుల్లో మరికొంత రేట్ల తగ్గింపు ప్రకటన చేస్తుందని అధికారులు పేర్కొనడంతో భవిష్యత్తు రాబడికి బంగారం ఆశాకిరణంగా కనబడుతుంది, అందుకే దాని ధరలు భారీగా పెరుగుతున్నాయని ర్యాన్ మెక్‌ఇంటైర్ అన్నారు.

అలాగే ఫెడ్ నిర్ణయం భారత్‌పై కూడా ప్రభావం చూపుతుంది. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 660 పెరగ్గా.. కిలో వెండి రూ.1500 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 75,260.

Advertisement

Next Story