నేడు అతిస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

by samatah |   ( Updated:2023-04-17 02:02:13.0  )
నేడు అతిస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ గత రెండు,మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా, ఈరోజు బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి.

సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గగా, గోల్డ్ రేట్ రూ.55,940గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గడంతో గోల్డ్ ధర రూ.61,030గా ఉంది.


ఇవి కూడా చదవండి:

ఏప్రిల్ 17 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే?

Advertisement

Next Story

Most Viewed