Gold Price: ఒక్కరోజే రూ. 1,500 తగ్గిన బంగారం

by S Gopi |
Gold Price: ఒక్కరోజే రూ. 1,500 తగ్గిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మంగళవారం సైతం దిగొచ్చిన పసిడి నెల రోజుల కనిష్టానికి దిగొచ్చింది. ఆభారణాల తయారీదారులతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ నెమ్మదించడంతో ధరలు తగ్గుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,470 తగ్గి రూ. 77,290కి చేరుకుంది. ఆభారణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 1,350 దిగొచ్చి రూ. 70,850కి తగ్గింది. వెండి కూడా కిలోకు రూ. 2000 తగ్గింపుతో రూ. 1,02,000 గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లలోనూ బంగారం ఔన్సు 2,597 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 30 డాలర్లుగా ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో డాలర్ అమాంతం పెరిగి 4 నెలల గరిష్టానికి చేరింది. డాలర్ పెరుగుదలతో బంగారంపై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గింది. ట్రంప్ విధానాలు డాలర్‌కు వరంగా మారడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గవచ్చని, వచ్చే ఏడాది ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదిస్తుందనే అంచనాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. దీంతో పాటు ట్రంప్ వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపవచ్చనే అంచనాలు సురక్షిత పెట్టుబడి సాధనం బంగారం గిరాకీపై ప్రభావం చూపింది.

Advertisement

Next Story

Most Viewed