- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ ఎఫెక్ట్‌తో భారీగా తగ్గిన బంగారం ధరలు
దిశ, వెబ్‌డెస్క్: పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. బంగారంపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో పసిడి ధరలు అమాంతం పడిపోయాయి. బడ్జెట్ ఎఫెక్ట్‌తో బులియన్ మార్కెట్లో 10 గ్రాముల (తులం) గోల్డ్ రేట్ దాదాపుగా రూ.3 వేల వరకు పతనమైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.2290 రూపాయలు తగ్గి రూ.70,086 చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.2750 తగ్గి తులం ధర రూ.64,950కి పడిపోయింది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర సుమారుగా రూ.3500 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.88 వేలకు చేరుకుంది. కాగా, గత కొంతకాలంగా ఆకాశానంటుతున్న బంగారం ధరలు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- Budget 2024