Gold Price: 2025లో బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్..!

by Maddikunta Saikiran |
Gold Price: 2025లో బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన ఫస్ట్ గుర్తొచ్చేది బంగారం(Gold). అత్యవసర పరిస్థితుల్లో డబ్బు(Money) అవసరమైనప్పుడు చాలా మంది గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్(Loans) తీసుకుంటారు. అలాగే కొన్ని సార్లు సురక్షిత పెట్టుబడి సాధనంగాను గోల్డ్ ఉపయోగపడుతుంది. కాగా ఈ ఏడాది పలు కారణాల వల్ల బంగారం ధర విపరీతంగా పెరిగింది. అయితే వచ్చే సంవత్సరం(2025) కూడా గోల్డ్ రేట్ గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఇయర్ లాగే రాజకీయ అనిశ్చితి పరిస్థితులు , వార్స్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెంపు కొనసాగితే.. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 85,000 వేల నుంచి రూ. 90,000 వరకు చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 79,350 వద్ద ట్రేడవుతోంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్సేంజీ(MCE)లో రూ. 76,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఈ ఇయర్ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టిన వారికి మంచి రిటర్న్స్(Returns) కూడా వచ్చాయి. ఇక గోల్డ్ లాగే వెండి(Silver) ధర కూడా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి 1.10 లక్షలు వరకు పలుకుతోంది. ఇదే దూకుడు కొనసాగితే రూ. 1.25 లక్షల వరకు చేరుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. రాజకీయ అనిశ్చితి, యుద్ధాలు లేకుంటే రేట్ పెరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed