- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు వారాల కనిష్టం నుంచి మళ్లీ పెరిగిన బంగారం ధరలు
దిశ, బిజినెస్ బ్యూరో: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు మంగళవారం రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. అయితే బంగారం ప్రియులకు ఆ ఆనందం ఒక్కరోజుకే పరిమితమైంది. బుధవారం పసిడి మళ్లీ పెరగడంతో ఇంకా ఎంతవరకు దూసుకెళ్తుందోనని సామాన్యులు కంగారు పడుతున్నారు. మద్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలను తీసుకునే ప్రయత్నం చేశారు. అందుకే 2 వారాల కనిష్టానికి తగ్గింది. కానీ, తాజాగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లకు సంబంధించి ఇన్వెస్టర్లు అమెరికా ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. బుధవారం సాయంత్రానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 490 పెరిగి రూ. 72,650 ఉండగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 450 పెరిగి రూ. 66,600కి చేరుకుంది. కానీ, వెండి కిలోకు స్వల్పంగా తగ్గి రూ. 86,400 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం అత్యల్పంగా 0.2 శాతం పెరిగి రూ. 2,328కి చేరింది.