- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈసారి అక్షయ తృతీయకు పసిడి అమ్మకాలు డౌటే!
ముంబై: దేశవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాదికి సంబంధించి శనివారం అక్షయ తృతీయకు అమ్మకాలు క్షీణించవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. సాధారణంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఏడాది మొత్తం సంపద ఉంటుందని భారతీయులు నమ్ముతారు.
అయితే, ఈసారి గ్లోబల్, దేశీయ పరిణామాల కారణంగా బంగారం రూ. 60 వేల దిగువకు రాకుండా ఊరిస్తోంది. కాబట్టి అధిక ధరల కారణంగా ఈసారి అక్షయ తృతీయకు పసిడి కొనేందుకు ప్రజలు దూరంగా ఉండొచ్చని, దానివల్ల అమ్మకాలు 20 శాతం మేర తగ్గుతాయని ఆభరణాల తయారీదారులు చెబుతున్నారు.
సాధారణంగా ప్రతి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా దక్షిణాదిలో 40 శాతం, పశ్చిమలో 25 శాతం, తూర్పున 20 శాతం, ఉత్తరాదిలో మిగిలిన 15 శాతం వ్యాపారం జరుగుతుంది. కానీ, ఈ ఏడు అక్షయ తృతీయకు అధిక ధరలు డిమాండ్‌పై ప్రభావం చూపుతాయని, ధరలు సామాన్యులు కొనే స్థాయికి దూరంగా ఉండటంతో విక్రయాలు పడిపోతాయని జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) ఛైర్మన్ సయామ్ మెహ్రా అన్నారు.
కాగా, గురువారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి పది గ్రాములు రూ. 60,930 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 55,850 వద్ద ఉంది. వెండి కిలో రూ. 81 వేలుగా ఉంది.
Also Read..