- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold & Silver Prices: ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే !
దిశ, వెబ్ డెస్క్: కొద్దిరోజులుగా బంగారంతో పాటు వెండి ధర కూడా అమాంతం పెరుగుతూ.. కొనుగోలు దారులకు చుక్కలు చూపించాయి. కిలో వెండి ధర లక్ష మార్కును దాటేసి.. లక్షా 15 వేల వరకూ చేరగా.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1350 నుంచి రూ.1790 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1350 తగ్గగా.. ప్రస్తుతం ధర రూ. 58,910గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1650 తగ్గడంతో రూ.72000కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1790 తగ్గడంతో.. రూ.78,560కి దిగివచ్చింది. బంగారం ధర భారీగా తగ్గడంతో బంగారం కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. రెండ్రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర నేడు నేడు ఏకంగా రూ.3000 తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,02,000గా ఉంది. సరిగ్గా పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలు దారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. పసిడి ప్రియులు ధరలు తగ్గడంతో బంగారం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.