- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవర్ ఉన్నా లేనట్టే.. కొత్త టెలీ డ్రైవింగ్ కార్లొచ్చేశాయ్
దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు ప్రపంచ వాహన రంగంలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అత్యంత చర్చనీయాంసమైన అంశంగా ఉండేవి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ రకమైన కార్లు రోడ్లపై తిరుగుతుండగా, తాజాగా జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ 'వే' దీనికి మించి టెలీ డ్రైవింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వే కంపెనీ మొట్టమొదటి రిమోట్ డ్రైవింగ్ రెంటల్ కారు సేవలను తాజాగా లాస్ వెగాస్‌లో ప్రారంభించింది. ఒక వ్యక్తి గదిలో కూర్చునే నియంత్రించే విధంగా ఈ కారులో టెక్నాలజీ అమర్చి ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగ దశలోనే చేపడుతున్నప్పటికీ రానున్న రోజుల్లో ఇతర వాహనాల కంటే తక్కువ ధరకు సేవలందించగలిగితే టెలీ డ్రైవింగ్‌కు డిమాండ్ పెరుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. టెలిడ్రైవింగ్ గురించి ఇంతకు ముందు విని ఉండకపోవచ్చు, కానీ ఇది కొత్త అనుభవం. వే కంపెనీ రూపొందించిన టెక్నాలజీతో, ఒక వ్యక్తిని పికప్ చేసుకునేందుకు కారుని బుక్ చేసినప్పుడు, ఒక భవనంలో కూర్చున్న 'వే' డ్రైవర్ ముందున్న స్క్రీన్‌లను చూస్తూ రిమోట్ ద్వారా కారును నడుపుతాడు. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారులా కనిపిస్తుంది. కానీ ఎక్కడో మరొక వ్యక్తి ఈ కారుపై పూర్తిగా నియంత్రణను కలిగి ఉంటాడు.
ఖర్చు ఆదా చేసేందుకు..
వే కంపెనీ టెలిడ్రైవింగ్ సేవలను ప్రస్తుతానికి నెవాడా విశ్వవిద్యాలయం, లాస్ వెగాస్, నగరంలోని ఆర్ట్స్ డిస్ట్రిక్ట్‌లో అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో కెమెరాలను ఉపయోగించి స్వయంగా డ్రైవ్ అయ్యేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని వే సీఈఓ థామస్ వాన్ డెర్ అన్నారు. ఈ కారులో ఖర్చు ఆదా చేసేందుకు రైడర్‌కు బదులుగా కెమెరాలను ఉపయోగిస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ కోసం ఇప్పుడున్న ఎల్ఐడీఏఆర్, రాడార్ టెక్నాలజీల కంటే చౌకైన ఫీచర్లను ఇందులో వాడనున్నట్టు థామస్ పేర్కొన్నారు.
అద్దె క్యాబ్‌ల కంటే చౌక..
వే కంపెనీ టెక్నాలజీతో వచ్చిన టెలీ డ్రైవింగ్ కారుకు నిమిషానికి 0.30 డాలర్(సుమారు రూ. 25) ఖర్చు అవుతుందని, ఇది ఇతర అద్దె క్యాబ్‌ల కంటే తక్కువని థామస్ తెలిపారు.
పార్కింగ్ తలనొప్పి ఉండదు..
ఈ రకమైన టెలీ డ్రైవింగ్ కార్లు ట్యాక్సీ, రెంటల్ కార్ల మిశ్రమ పద్దతిలో ఉంటాయి. దీనివల్ల చాలామందికి పార్కింగ్ సమస్య ఉండదని వే కంపెనీ అమెరికా జనరల్ మేనేజర్ సెలబ్ వార్నర్ చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడూ ఒకవ్యక్తి ఈ కారును కంట్రోల్ చేస్తుండటం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కారు కంటే టెలీ డ్రైవింగ్ కారు చాలా సురక్షితమని వార్నర్ వెల్లడించారు.