భారతదేశ చరిత్రలో మొదటి సారి.. గరిష్ట స్థాయిలో పెట్రోల్, డీజిల్..

by Mahesh |
భారతదేశ చరిత్రలో మొదటి సారి.. గరిష్ట స్థాయిలో పెట్రోల్, డీజిల్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో ఇంధన వినియోగం మార్చిలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుందని చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ డేటా చెబుతుంది. భారతదేశ ఇంధన వినియోగం మార్చి 2023 లో రికార్డు స్థాయిలో పెరిగింది. గడిచిన మార్చి నెలలో అత్యధికంగా 20.5 మిలియన్ టన్నుల ఇంధన వినియోగాన్ని నమోదు చేసినట్లు చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. 1998లో డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యధిక వినియోగ స్థాయిగా రికార్డయింది. దీంతో పాటు రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే బిటుమెన్.. కూడా మార్చి నెలలో భారీగా పెరిగిందని చమురు మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ తెలిపింది.

Advertisement

Next Story