- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్లెయిమ్ చేయని డిపాజిట్లు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్: నిర్మలా సీతారామన్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం జరిగిన ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి(ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్‌లను పొందడానికి ప్రజలకు సహాయపడే విధంగా డ్రైవ్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న తొలి ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్ సహా పలు ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బాగా రక్షణ, నియంత్రణ కలిగి ఉంది. అయితే, ఇదే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా బ్యాంకుల సంక్షోభ ప్రభావం ఏమీ లేదన్నారు. అలాగే, 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు అవసరమైన శాసన మార్పులను ప్రభుత్వం వేగవంతం చేయాలని అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థిక మంత్రి సూచించిన విధంగా అన్‌క్లెయిమ్ చేయని డిపాజిట్లు ప్రజలు పొందే విధంగా ఒక డ్రైవ్ చేపడతామన్నారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు రూ. 35 వేల కోట్ల విలువైన అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు ఉండగా, అవి గత 10 ఏళ్ల నుంచి ఉన్నందున బ్యాంకులు ఆర్‌బీఐకి బదిలీ చేశాయి. గత నెల ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాత దాస్, వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను మూడు, నాలుగు నెలల్లోగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.