Semiconductor: హెచ్‌సీఎల్‌తో ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్.. రూ.424 కోట్ల పెట్టుబడి

by S Gopi |
Semiconductor: హెచ్‌సీఎల్‌తో ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్.. రూ.424 కోట్ల పెట్టుబడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: తైవానీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కంపెనీ సెమీకండక్టర్ తయారీ కోసం హెచ్‌సీఎల్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ. 424 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ కాంట్రాక్ట్ తయారీదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ కొంతకాలంగా సెమీకండక్టర్ విభాగంలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తోంది. భారత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుండటంతో హెచ్‌సీఎల్‌తో కలిసి జేవీని ప్రారంభించనుంది. కొత్త సంస్థలో 40 శాతం వాటాను సుమారు రూ.312 కోట్లకు కొనుగోలు చేసింది. జేవీ అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ ప్లాంటును నిర్వహించనున్నారు. దీంతో ఈ ఏడాది ఆగష్టు నాటికి ఫాక్స్‌కాన్ సంస్థ భారత్‌లో 1.4 బిలియన్ డాలర్ల(రూ. 11.75 వేల కోట్ల)కు పైగా పెట్టుబడి పెట్టింది. కాగా, కంపెనీకి దేశీయంగా మొత్తం 48,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

Next Story

Most Viewed