- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో మొదటి సారి.. $ 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లోకి భారత స్టాక్ మార్కెట్
దిశ, వెబ్ డెస్క్: చరిత్రలో మొట్టమొదటిసారిగా నేడు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. భారత స్టాక్ మార్కెట్ గత 6 నెలల కాలంలోనే 1 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించి ఎన్నడూ లేనివిధంగా అరుదైన రికార్డులను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా ఎన్నికల వాతావరణం ఉంది. దీంతో విదేశీ పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నప్పటికి భారత స్టాక్ మార్కెట్లు ఈ వృద్దిని సాధించాయి. కాగా మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ రూ. 414. 75 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ వృద్ధి ఎన్నికల తర్వాత కూడా ఇలాగే కొనసాగితే భారత్ త్వరలోనే అన్ని రంగాల్లో మరింత వృద్ధి ని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేడు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. భారత స్టాక్ మార్కెట్ గత 6 నెలల కాలంలోనే 1 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. దేశంలోని బలమైన ప్రభుత్వానికి మదుపరుల నుంచి లభిస్తున్న అపూర్వమైన మద్దతుకు ఇది నిదర్శనం. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే భారత స్టాక్ మార్కెట్ మరింత వేగంగా పరుగులు పెట్టి ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయతను, అభివృద్ధికి అవసరమైన శక్తిని సంపాదించనుందని కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన ఆశాభావం వ్యక్తం చేశారు.