- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PSBs: డిపాజిట్ల మెరుగుదలకు పీఎస్‌బీల అధిపతులతో ఆర్థిక మంత్రి సమావేశం
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సొమవారం సమావేశం నిర్వహించారు. పీఎస్‌బీల పనితీరుపై సమీక్షతో పాటు వాటి డిపాజిట్ల వృద్ధిని మెరుగుపరిచేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ కోరారు. గత కొన్ని నెలల్లో క్రెడిట్ వృద్ధి కంటే డిపాజిట్లు 3-4 శాతం తక్కువ వృద్ధి కనిపిస్తోందని, దానివల్ల బ్యాంకుల ఆస్తి-రుణాల సమతుల్యత దెబ్బతింటుందని ఆర్థిక మంత్రి అన్నారు. ఇదే సమయంలో బ్యాంకుల ఆర్థిక పనితీరు, పీఎం ఆవాస్ యోజన, పీఎం సూర్య ఘర్, పీఎం విశ్వకర్మ యోజనతో సహా ప్రభుత్వానికి చెందిన వివిధ పథకాల అమలులో సాధించిన పురోగతిని సమీక్షించారు. బ్యాంకుల అధిపతులు ప్రధాన బ్యాంకింగ్ వ్యాపారంపై దృష్టి సారించాలని, కొత్త అవకాశాలను అమలు చేయడం, తద్వారా డిపాజిట్లు పెంచేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రుణాలు ఇవ్వడంలో వృద్ధి ఎక్కువగా ఉంది. అయితే, డిపాజిట్ సేకరణకు సంబంధించి ప్రాముఖ్యత గురించి వివరించనున్నట్టు ఆర్థిక మంత్రి అంతకుముందు ఓ ప్రకటనలో చెప్పారు. వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ పీఎస్‌బీలకు స్వేచ్ఛనిచ్చిందని, దాన్ని ఉపయోగించి బ్యాంకులు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలని పేర్కొన్నారు.