FM Nirmala: గ్రీన్ ఎనర్జీ కోసం పన్ను రాబడి ముఖ్యం: నిర్మలా సీతారామన్

by Harish |
FM Nirmala: గ్రీన్ ఎనర్జీ కోసం పన్ను రాబడి ముఖ్యం: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పునరుత్పాదక శక్తి పెంపుదలపై దృష్టి సారించిన నేపథ్యంలో గ్రీన్ పవర్ కోసం వివిధ ఆవిష్కరణలకు సంబంధించి గ్లోబల్ ఫండ్స్ అందుబాటులో లేనప్పుడు పన్ను రాబడి ద్వారా వచ్చే నిధులు ఈ రంగానికి ఉపయోగపడుతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 13 న చెప్పారు. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో మాట్లాడిన ఆమె, పన్నులను సున్నాకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను, కానీ దేశం ముందున్న సవాళ్ల కారణంగా భారతదేశ పన్నులను శూన్యంగా చేయలేమని ఆమె అన్నారు.

భారత్ స్వంత నిధులతో శిలాజ ఇంధనం నుండి పునరుత్పాదక శక్తికి మారడానికి ముందుకు సాగుతుంది. ఈ దిశగానే భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనికోసం ప్రపంచ నిధులకు వేచి ఉండలేము. పునరుత్పాదక శక్తి పరివర్తన స్థిరంగా ఉండాలంటే, వినూత్న పరిష్కారాలు అవసరం. పన్నుల ద్వారా వచ్చే డబ్బును పరిశోధనలకు నిధులు సమకూర్చేందుకు చాలా ముఖ్యం అని నిర్మలా చెప్పారు. గ్రీన్ ఎనర్జీ కోసం ఇంధన నిల్వలో అగ్రగామిగా ఉండాలి. సౌరశక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు లేదు. దీనిని నిల్వ చేయడానికి బ్యాటరీ సామర్థ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, బ్యాటరీ నిల్వలో భారతదేశం ముందంజలో నిలిచే వరకు, దేశం బొగ్గు, ముడి చమురు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ఇదే సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ, 2024 మార్చిలో, AI సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రూ.10,300 కోట్ల కంటే ఎక్కువ కేటాయింపులను కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. అంతేకాకుండా, సెమీకండక్టర్ చిప్‌ల అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ కోసం భారతదేశం మూడు యూనిట్లను ఏర్పాటు చేసినట్లు సీతారామన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed