- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొలి వాణిజ్య విమానాలను ప్రారంభించనున్న FLY91 ఎయిర్‌లైన్
దిశ, బిజినెస్ బ్యూరో: గోవాకు చెందిన విమానయాన సంస్థ FLY91 మార్చి 18 నుండి తొలి వాణిజ్య విమానాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మొదటి ఏడాది కార్యకలాపాలు పూర్తయ్యే నాటికి 350 సిబ్బందితో పాటు ప్రయాణికుల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. FLY91 ఎండీ, సీఈఓ మనోజ్ చాకో మాట్లాడుతూ, ఎయిర్‌లైన్ విస్తరణ, స్థిరత్వం కోసం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను కలిగి ఉన్నాము, ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.
విమానయాన సంస్థ ప్రస్తుతం రెండు ATR 72-600 విమానాలను కలిగి ఉంది. కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో మరో నాలుగు విమానాలు జత చేయనుంది. ప్రారంభంలో, FLY91 గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ వారానికోసారి విమాన సర్వీసులను ప్రారంభించనుంది . అలాగే, సింధుదుర్గ్, మహారాష్ట్ర, బెంగళూరు మధ్య కూడా కనెక్టివిటీని అందిస్తుంది. తరువాత అగట్టి, పూణే, జల్గావ్, నాందేడ్‌లకు విమానాలను ప్రారంభిస్తుంది. లక్షద్వీప్‌లోని అగట్టికి ఏప్రిల్ నుండి సేవలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం సంస్థలో 200 మంది సిబ్బంది ఉన్నారు.