ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ లక్ష ఉద్యోగాలు..!

by Shiva |
ఈ ఏడాది పండుగ సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్ లక్ష ఉద్యోగాలు..!
X

బెంగళూరు: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది పండుగ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ నెలలో ప్రారంభం కాబోయే పండుగ సీజన్ కోసం కంపెనీ ఏకంగా లక్ష మంది సీజనల్ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత మార్కెట్లో పండుగ సీజన్‌కు ఉండే గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఫ్లిప్‌కార్ట్ సరఫరాను మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా నియామకాలు చేపడతామని వెల్లడించింది.

అంతే కాకుండా మహిళలు, దివ్యాంగులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొంది. ముఖ్యంగా డెలివరీ విభాగంతో పాటు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లలో ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. కంపెనీ నిర్వహించే అతిపెద్ద సేల్ బిగ్ బిలియన్ డేస్ సమయంలో ప్రధాన బ్రాండ్ల ఉత్పత్తులతో పాటు మిగిలిన ఆఫర్ల కోసం వినియోగదారులు ఈ-కామర్స్‌లో కొనుగోలు చేస్తారు. ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని సామర్థ్యం, డెలివరీ, స్టోరేజ్, హ్యూమన్ రీసోర్స్ విభాగాలను మరింత బలోపేతం చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ హేమంత్ బద్రి అన్నారు.

Advertisement

Next Story