- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Flipkart: పండుగ సీజన్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష ఉద్యోగాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ కోసం సిద్ధమవుతోంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన డెలివరీ సేవలందించేందుకు ఫ్లిప్‌కార్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ కోసం నిర్వహించే ఫెస్టివల్ సీజన్ సేల్‌తో పాటు ది బిగ్ బిలియన్ డేస్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఏకంగా లక్ష ఉద్యోగాలను చేపట్టనున్నట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ కోసం మాత్రమే కంపెనీ తొమ్మిది నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని, దానివల్ల మొత్తం ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల సంఖ్య 83కి చేరిందని ఫ్లిప్‌కార్ట్ మాతృసంస్థ వాల్‌మార్ట్ గ్రూప్ తెలిపింది. 'సామాజిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే సరఫరా వ్యవస్థలో లక్ష మందిని నియమించడంపై దృష్టి సారించాం. దీని ద్వారా ఈ ఏడాది పండుగ సీజన్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ సేవల నిర్వహణ కార్యకలాపాలను మరింత సమర్థవంతం చేయడమే కాకుండా స్థానికంగా ఉపాధిని కల్పిస్తుందని' వాల్‌మార్ట్ వెల్లడించింది. ఈ నియామకాలు ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్ అసోసియేట్‌లు, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లు, కిరాణా భాగస్వాములు, డెలివరీ ఏజెంట్లతో సహా వివిధ సప్లై చైన్ వర్టికల్స్‌లో విభాగాల్లో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.