పాత పన్ను విధానం రద్దుపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

by Harish |   ( Updated:2024-07-23 14:45:25.0  )
పాత పన్ను విధానం రద్దుపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024 కేంద్ర బడ్జెట్‌‌లో కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఈ విధానాన్ని రద్దు చేస్తారని ఊహగానాలు వస్తుండగా, తాజాగా బడ్జెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పాత పన్ను విధానాన్ని రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయడమే మా ఉద్దేశ్యం అని చెప్పారు. 2025లో పాత ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉందా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధమైన సమాధానం ఇచ్చారు. తాజా బడ్జెట్‌లో కొత్త విధానంలో పలు మార్పులు చేశారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 ల నుంచి రూ.75,000 పెంచారు. దీంతో పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ. 17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ప్రసంగంలో మంత్రి చెప్పారు .

Advertisement

Next Story

Most Viewed