RIL-Disney Merger: రిలయన్స్, డిస్నీ రూ. 70 వేల కోట్ల విలీనానికి సీసీఐ ఆమోదం

by S Gopi |
RIL-Disney Merger: రిలయన్స్, డిస్నీ రూ. 70 వేల కోట్ల విలీనానికి సీసీఐ ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మీడియా రంగంలో అతిపెద్ద విలీనమైన రిలయన్స్-డిస్నీ ఒప్పందం కొలిక్కి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), వాల్ట్ డిస్నీ భారత మీడియా ఆస్తుల విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు సంస్థల మధ్య రూ. 70,350 కోట్లకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి కొన్ని సవరణలు చేస్తూ ఆమోదించినట్టు సీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సవరణల గురించి సీసీఐ వివరణ ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారం, ఆర్ఐఎల్, దాని అనుబంధ సంస్థలు రెండు స్ట్రీమింగ్ సేవలు, 120 టెలివిజన్ ఛానెల్‌లను కలిగి ఉంటాయి. ఈ సంయుక్త సంస్థలో 63.16 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 36.84 శాతం వాటా వాల్ట్ డిస్నీకి చెందుతుంది. దీనివల విలీన సంస్థ అతిపెద్ద మీడియా సంస్థగా మారనుంది. దీనికి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, మాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్-ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed