ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుండి డైరెక్ట్ అమెజాన్ షాపింగ్

by Harish |   ( Updated:2023-11-11 09:45:01.0  )
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుండి డైరెక్ట్ అమెజాన్ షాపింగ్
X

న్యూఢిల్లీ: మోటా సంస్థ తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుండి నేరుగా అమెజాన్ ఉత్పత్తులను షాపింగ్ చేయడానికి అనుమతించే ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, మెటా మధ్య కీలక చర్చలు జరిగాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా వివిధ ఈ కామర్స్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు అదే బాటలో అమెజాన్ సంస్థ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు, స్మార్ట్‌ఫోన్లు మొదలగు వాటిని ప్రమోట్ చేస్తుంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎవరైనా యూజర్ ఉత్పత్తులపై క్లిక్ చేయగానే నేరుగా అమెజాన్ కొనుగోలు పేజీకి వెళ్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఆదరణ ఎక్కువగా ఉంది. యూజర్లు రోజులో ఎక్కువ సమయం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో గడుపుతున్నారు. వీటిలో తమ ఉత్పత్తులకు ప్రమెషన్ ఇవ్వడం ద్వారా అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అమెజాన్ పేర్కొంది. Facebook, Instagram నుంచి సరికొత్త షాపింగ్ అనుభవాన్ని పొందవచ్చని మెటా అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిని ఎంపిక దేశాల్లో అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed