Woman Employees: వారానికి 55 గంటలు పని చేస్తున్న యువ మహిళా ఉద్యోగులు

by S Gopi |
Woman Employees: వారానికి 55 గంటలు పని చేస్తున్న యువ మహిళా ఉద్యోగులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)గా ఉన్న యువతి మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అధిక పని ఒత్తిడి కారణంగా అనా సెబాస్టియన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతం తర్వాత దేశవ్యాప్తంగా యువ మహిళా ఉద్యోగుల పని ఒత్తిడి అనే అంశం కీలకంగా మారింది. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఉన్న రంగాల్లో యువతుల పని ఒత్తిడిపై అధ్యయనాలు పెరిగాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) డేటా ప్రకారం, ఐటీ, కమ్యూనికేషన్, టెక్నికల్ ప్రొఫెషన్స్ వంటి రంగాల్లో మహిళలు ఎక్కువ పని గంటల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీ, జర్నలిజం లాంటి రంగాల్లో ఉన్న మహిళలు వారానికి సగటున 56.5 గంటలు పనిచేస్తున్నారు. అదేవిధంగా వృత్తిపరమైన, టెక్ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సగటున 53.2 గంటలు పనిచేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

యంగ్ ఉమెన్ ప్రొఫెషనల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐటీ, మీడియాలో 15-24 సంవత్సరాల వయస్సు గల మహిళలు వారానికి సగటున 57 గంటలు పని చేస్తున్నారు. అలాగే, టెక్ ప్రొఫెషనల్స్‌గా ఉన్నవారు 55 గంటలు చేస్తున్నారు. ఇది అన్ని వయసుల వారి కంటే అత్యధికం. టెక్నికల్, కమ్యూనికేషన్ రంగాలలో భారతీయ మహిళలు ప్రపంచ సగటు కంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ఉదాహరణకు, జర్మనీలోని ఐటీ, మీడియా రంగాల్లోని మహిళలు వారానికి సగటున 32 గంటలు పనిచేస్తుండగా, రష్యాలో ఇలాంటి రంగాల్లోని మహిళలు 40 గంటలు పని చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed