Elon Musk: ట్రంప్ ఘనవిజయం.. 300 బిలియన్ డాలర్లు దాటిన ఎలన్ మస్క్ సంపద

by Maddikunta Saikiran |
Elon Musk: ట్రంప్ ఘనవిజయం.. 300 బిలియన్ డాలర్లు దాటిన ఎలన్ మస్క్ సంపద
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America)లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ(Republican Party) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ(Democratic Party) అభ్యర్థి కమలా హారీస్(Kamala Harris)పై ఆయన గెలుపొందారు. దీంతో ఆయన రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్(US President)గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ట్రంప్ విజయం సాధించడంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆయన సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మాస్క్ నికర సంపద 300 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaire Index) నివేదించింది. మస్క్ సంపద ఈ మార్క్ కు చేరుకోవడం మూడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారని పేర్కొంది. శుక్రవారం ఒక్క రోజే టెస్లాకు చెందిన షేర్లు విలువ(shares value) 28 శాతం పెరగడంతో ఆయన సంపద 50 బిలియన్లు పెరిగి 313.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఇక అమెజాన్(Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos) 230 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, మెటా(Meta) అధినేత మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) 209 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed