భారత్‌లో 'బ్యాటరీ స్టోరేజీ ఫ్యాక్టరీ' ఏర్పాటు కోసం టెస్లా ప్రయత్నాలు!

by Harish |   ( Updated:2023-09-22 10:04:30.0  )
భారత్‌లో బ్యాటరీ స్టోరేజీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టెస్లా ప్రయత్నాలు!
X

న్యూఢిల్లీ:గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో సరికొత్త వ్యూహంతో రాణించాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం కంపెనీ 'బ్యాటరీ స్టోరేజీ ఫ్యాక్టరీ' ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రోత్సాహకాలు కోరుతూ ప్రతిపాదనలు చేసింది. సోలార్ ప్యానెల్స్, గ్రిడ్ నుంచి విద్యుత్‌ను స్టోర్ చేసుకుని రాత్రి లేదా అంతరాయం కలిగినపుడు ఉపయోగించుకునే విధంగా బ్యాటరీలను వినియోగించాలని కంపెనీ భావిస్తోంది.

టెస్లా ప్రతిపాదనను ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. అయితే, ప్రోత్సాహకాలు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి బొగ్గు ఆధారితం కావడంతో టెస్లా పవర్‌వాల్ ప్రతిపాదనను తీసుకొచ్చింది.

ఇది ఒక మీటర్ ఎత్తైన యూనిట్. దీన్ని గ్యారేజీలో లేదా ఇంటి బయట ఏర్పాటు చేయవచ్చు. టెస్లా ప్రణాళిక ఫలిస్తే భారత్‌లో పెద్ద ఎత్తున వీటి వినియోగాన్ని చేపట్టనుంది. ప్రస్తుతం అమెరికాలో పవర్‌వాల్ ధర 5,500 డాలర్ల(రూ. 45 వేల) కంటే ఎక్కువ, సోలార్ ప్యానెల్‌ల ఖర్చు అదనం. ఈ క్రమంలోనే బ్యాటరీ స్టోరేజ్‌పై కృష్టి చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed