- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన ఎలాన్ మస్క్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. డిప్రెషన్ నుంచి బయటపడటానికి చికిత్స కొరకు డాక్టర్ సూచన మేరకు కెటమిన్ అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు జర్నలిస్ట్ డాన్ లెమన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు. గతంలో రోజుకు 16 గంటలు పనిచేసేవాణ్ణి దీంతో ఒత్తిడి, మెదడులో ఒక విధమైన ప్రతికూల పరిస్థితుల వల్ల మానసిక కుంగుబాటుకు గురయ్యాను. ఇలా ఎక్కువ కాలం ఉన్నట్లయితే టెస్లా పనితీరుపై ప్రభావం ఉంటుంది, అందుకే దాన్నుంచి బయటపడటానికి వైద్యుడిని సంప్రదించగా ఆయన సూచన మేరకు ప్రతి వారానికి ఒకసారి తక్కువ మొత్తంలో మాత్రమే కెటమిన్‌ను తీసుకునేవాడినని మస్క్ పేర్కొన్నారు. అయితే ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకుంటే మాత్రం ఏ పనిని పూర్తి చేయలేరని ఆయన అన్నారు.
కొన్ని వారాల క్రితం మస్క్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ఒక కథనం వచ్చింది. అతను ప్రైవేట్ పార్టీలలో తరచుగా LSD, కొకైన్, ఎక్స్టాసీ, సైకెడెలిక్ పుట్టగొడుగులను తీసుకున్నారని, దీనిపై స్సేస్ ఎక్స్, టెస్లా సంస్థల బోర్డు మెంబర్స్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని కథనం పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా మస్క్ స్పష్టతనిచ్చారు. 2018లో జో రోగన్ షోలో మస్క్ గంజాయిని సేవిస్తూ కనిపించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నాసా, స్సేస్ ఎక్స్ సంస్థను వివరణ కోరగా డ్రగ్స్ రహిత కార్యాలయంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.