పాపం Elon Musk.. రూ.1.30 లక్షల కోట్లు కోల్పోయి రికార్డు!

by Harish |   ( Updated:2023-10-20 13:19:47.0  )
పాపం Elon Musk.. రూ.1.30 లక్షల కోట్లు కోల్పోయి రికార్డు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ధనవంతుడు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 44 శాతం తగ్గింది. దీంతో టెస్లా షేర్లు ఒకే రోజు భారీగా క్షీణించి రూ.1.30 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అయితే ఇంత భారీ మొత్తంలో సంపదను కోల్పోయినప్పటికీ కూడా మస్క్ 210 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

ఈ ఏడాదిలో మస్క్ సంపద 70 బిలియన్ డాలర్లు పెరగ్గా తాజాగా టెస్లా షేర్లు 9.3 శాతం నష్టపోవడంతో 220.11 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇటీవల కాలంలో ఇతర కంపెనీల నుంచి టెస్లా భారీగా పోటీని ఎదుర్కొంటుంది. దీంతో ఆశించినంతగా ఆదాయాన్ని కంపెనీ పొందలేకపోయింది. అలాగే, వడ్డీ రేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తీవ్రంగా ఉందని మస్క్ పేర్కొనడం కూడా తీవ్ర ప్రతికూలత అయింది. అయినా కూడా సవాళ్లను ఎదుర్కొని కస్టమర్లకు అందించాల్సిన 1.8 మిలియన్ల కార్లను డెలివరీ చేస్తామని మస్క్ తెలిపారు.

Advertisement

Next Story