- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడిలేచిన కెరటంలా ఎలన్ మస్క్ స్టోరీ!
వాషింగ్టన్: గ్లోబల్ టెక్ దిగ్గజం టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచ అత్యంత ధనవంతుడిగా మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా టెస్లా స్టాక్స్‌లో ఇటీవల క్షీణత కారణంగా వెనకబడ్డ మస్క్ మరోసారి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా జాబితా ప్రకారం, ఇప్పటివరకు 187 బిలియన్ డాలర్లతో ఆ స్థానంలో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద బుధవారం 2.6 శాతం పడిపోయింది. దాంతో ఎలన్ మస్క్ సంపద 192 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు.
గతేడాది డిసెంబర్‌లో ఆర్నాల్ట్ మొదటిసారిగా ఎలన్ మస్క్‌ను అధిగమించారు. ఎలన్ మస్క్ టెస్లా స్టాక్స్ బలహీనంగా ఉండటం, ట్విట్టర్ కొనుగోలు కారణంగా ఎదురైన సవాళ్లు వంటి అంశాలు మస్క్ సంపద తరిగిపోయేందుకు కారణమయ్యాయి. అదే సమయంలో లగ్జరీ ఉత్పత్తుల అమ్మకాలు ఊపందుకోవడంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంస్థ ఎల్ఈఎంహెచ్ షేర్ పెరిగింది. ఇటీవల అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఆందోళనలు నెలకొనడంతో లగ్జరీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గి, ఆర్నాల్ట్ సంపద దెబ్బతిన్నది.