- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Elon Musk: 334 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఎలన్ మస్క్ సంపద..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా(Tesla) అధినేత ఎలన్ మస్క్(Elon Musk) సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం మాస్క్ నికర సంపద 334.3 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్(Bloomberg Billionaire Index) నివేదించింది. యూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరగడం గమనార్హం. కాగా శుక్రవారం ఒక్క రోజే టెస్లాకు చెందిన షేర్ విలువ(share value) 3.8 శాతం పెరిగింది. దీంతో 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా మస్క్ రికార్డు సృష్టించారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో మస్క్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన సంపద భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే మస్క్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్‌గా ట్రంప్ నియమించిన విషయం తెలిసిందే. ఇది కూడా ఓ కారణంగా పలువురు పేర్కొంటున్నారు. ఇక అమెజాన్(Amazon) ఫౌండర్ జెఫ్ బెజోస్(Jeff Bezos) 219 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. ఒరాకిల్(Oracle) చైర్మన్ లారీ ఎల్లిసన్(Larry Ellison) 206 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.