- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Elon Musk: ఉద్యోగులకు బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ఇంజినీరింగ్ విభాగంలో లేఆఫ్స్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రముఖ కంపెనీలు లే ఆఫ్స్(Lay offs) ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా(Corona) మహమ్మారి వాళ్ళ ఏర్పడిన ఆర్ధిక మాంద్యం(Economic Depression) వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి బిలియనీర్ ఎలాన్ మాస్క్(Elon Musk)కు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ 'ఎక్స్(X)' చేరింది. తన సంస్థ లోని ఇంజినీర్ విభాగానికి(Dept. of Eng) చెందిన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. పెద్ద మొత్తంలో లే ఆఫ్స్ ప్రకటిస్తూ ఎక్స్ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని సంస్థ ఈ- మెయిల్స్(E-Mails) ద్వారా సిబ్బందికి తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ లే ఆఫ్స్ నిర్ణయంపై కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. కాగా 2022 అక్టోబర్ నెలలో ఎలాన్ మాస్క్ ఎక్స్ ను కొనుగోలు చేశారు. అప్పుడు ఆ కంపెనీ విలువ సుమారు 44 బిలియన్ డాలర్లు ఉండగా కంపెనీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆ సంస్థ మార్కెట్ వాల్యూ 9.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే అమెరికా మాజీ ప్రెసిడెంట్(US Former President), రిపబ్లికన్(Republican) నేత డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు చెందిన సోషల్ మీడియా ట్రూత్ సోషల్(Truth Social) మార్కెట్ విలువ ఎక్స్ మార్కెట్ వాల్యూని బ్రేక్ చేసినట్లు ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ ఫిడిలిటీ(Investment Group Fidelity) వెల్లడించింది.