- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ స్కూటర్‌ను డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నడపచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ‘యులు(Yulu)’ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘వైన్’ ను మార్కెట్లోకి విడుదల చేసింది. తేలికైన, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది బాగా నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ. 55,555. కొనుగోలుదారులు రూ. 999 చెల్లించి ముందస్తు బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 16 ఏళ్లు పైబడిన అన్ని వయస్సుల వారు దీన్ని తీసుకోవచ్చు. డెలివరీ 2023 మే నెలలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే లభిస్తుంది. ఏడాది తర్వాత ఇతర నగరాలకు కూడా అందుబాటులోకి వస్తుంది.
Yulu Wynn స్కూటర్‌లో 250 W ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. బ్యాటరీ 19.3 Ahతో నిమిషాల వ్యవధిలో మార్చుకోవడానికి సులభంగా ఉంటుంది. అలాగే, ఇంట్లో కూడా చార్జింగ్ పెట్టొచ్చు. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఒక్కచార్జింగ్‌తో 68 కి.మీ వరకు వెళ్తుంది. స్కూటర్‌లో మొబైల్ యాప్, కీలెస్ యాక్సెస్, ఆన్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, రిమోట్ వెహికల్ యాక్సెస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని గరిష్ట పేలోడ్ 100 కిలోలు. ఇది స్కార్లెట్ రెడ్, మూన్‌లైట్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. సస్పెన్షన్ పరంగా, స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక సస్పెన్షన్‌లు డ్యూయల్ షాక్‌గా ఉంటాయి.