- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JOBS: ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉద్యోగాలకే డిమాండ్ ఎక్కువ
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రైవేట్ రంగం విస్తరిస్తూ ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నప్పటికి కూడా దేశంలో చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2014-2022 మధ్య దాదాపు 220 మిలియన్ల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 7,22,000 మంది ఎంపికయ్యారు. వీళ్లలో చాలామంది రెండు కంటే ఎక్కువ సార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మరింత భద్రత ఉండటం, ఆరోగ్య ప్రయోజనాలు, పెన్షన్‌లు, గృహా సౌకర్యం మొదలగులనవి లభిస్తుండటంతో క్లర్క్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి సైతం పీహెచ్‌డీ చేసిన వారు సైతం దరఖాస్తు చేస్తుండటం గమనార్హం.
2014 నుండి, భారతదేశ జీడీపీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) $2 ట్రిలియన్ నుండి $3.5 ట్రిలియన్లకు పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 7.2% వృద్ధి చెందుతుందని అంచనా. దేశంలో చాలా కొత్త కంపెనీలు ఏర్పాటవుతూ, ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నప్పటికి కూడా ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే పట్టుదలగా కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొందరు తమ కుటుంబ పోషణ కోసం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే ప్రిపేర్ అవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న సానుకూలతలు కారణంగా చిన్న పోస్టుకు కూడా లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ ఫోర్స్‌లో 60,000 ఖాళీల కోసం దాదాపు 5 మిలియన్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థలలో కానిస్టేబుల్ పోస్ట్ కోసం జరిగిన పరీక్షలో 26,000 పోస్టులకు 4.7 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.
కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తే, వారు జీవితంలో స్థిరపడినట్లు కుటుంబం నమ్ముతుంది. దీంతో యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఏప్రిల్-మే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడానికి కారణం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించకపోవడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు.