- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మయిన్ ఫార్మా జనరిక్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిన డా రెడ్డీస్!
ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ డా. రెడ్డీస్ లాబొరేటరీస్ ఆస్ట్రేలియాకు చెందిన మయిన్ ఫార్మా గ్రూప్ అమెరికా జనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. దీని విలువ మన కరెన్సీలో రూ. 861 కోట్లు. అందులో రూ. 738 కోట్లను ముందస్తు చెల్లింపులు గాను, రూ. 123 కోట్లను ఆకస్మిక చెల్లింపులు చేసేందుకు ఒప్పందం జరిగింది.
మయిన్ ఫార్మా అమెరికా జనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో దాదాపు 85 జనరిక్ ఉత్పత్తులను కలిగి ఉంది. వాటిలో 45 కమర్షియల్, ఆమోదం పొందిన 40 నాన్-మార్కెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా వరకు ఉత్పత్తులు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ ఔషధాలు ఉన్నాయి. 2022, జూన్ 30 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్ట్‌ఫోలియో మొత్తం ఆదాయం 111 మిలియన్ డాలర్లుగా ఉంది.
డా రెడ్డీస్‌కు ఈ కొనుగోలు ద్వారా తక్కువ ధరలకే ఔషధాలను అందించడంతో పాటు అవసరమైన వాటిని వేగవంతంగా అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని డా రెడ్డీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరెజ్ ఇజ్రయెలీ పేర్కొన్నారు.