- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
USSD కాల్ ఫార్వార్డింగ్‌ను నిలిపివేయాలని టెలికాం కంపెనీలను కోరిన DoT
దిశ, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కీలక సూచనలు జారీ చేసింది. USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్ సౌకర్యాలను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం కంపెనీలను కోరింది. ప్రస్తుతం వినియోగదారులు *401# డయల్ చేయడం ద్వారా, వారి మొబైల్‌లలో కాల్ ఫార్వార్డింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సేవలను దుర్వినియోగం చేస్తున్నట్లు DoT గుర్తించింది. కొంతమంది వినియోగదారులు అసంబద్ధ కార్యకలాపాలలో ఈ సదుపాయాన్ని వాడుతున్నారు. కాల్ ఫార్వార్డింగ్ పద్ధతిని ఉపయోగించి మోసం చేస్తున్న కేసులు పెరుగుతున్నాయి.
సైబర్ నేరస్తులు టెలికాం సబ్‌స్క్రైబర్‌కు కాల్ చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ లేదా టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్‌గా మాట్లాడి సిమ్ కార్డ్‌లో సమస్య ఉందని, *401# కోడ్‌ను డయల్ చేసి ఫార్వార్డింగ్ యాక్టివేట్ చేయమని చెబుతారు, ఆ తరువాత ఇన్‌కమింగ్ కాల్‌లు మొదలైనవన్నీ కూడా నేరస్తుల మొబైల్ నంబర్‌కు ఫార్వార్డ్ అవుతాయి. ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో చాలా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కాల్ ఫార్వార్డింగ్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోడానికి ప్రత్యామ్నాయ పద్ధతులకు మారాలని DoT ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.