Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట

by S Gopi |
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునకు మాన్‌హటన్ కోర్టు భారీ ఊరట కల్పించింది. హష్‌మనీ కేసుకు సంబంధించి ట్రంప్‌నకు విధించాల్సిన శిక్షను నవంబర్‌లో ఎన్నికల పూర్తయ్యే వరకు వాయిదా వేసేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. హష్‌మనీ కేసు వ్యవహారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉండగా, ట్రంప్ తరపు న్యాయవాది తీర్పు వెలువడితే దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుందని వాదించారు. అనేక మార్గాల్లో ట్రంప్ న్యాయవాదులు తీర్పు వాయిదాకు ప్రయత్నించారు. న్యాయమూర్తికి పిటిషన్ వేయడమే కాకుండా ఫెడరల్ కోర్టు జోక్యాన్ని కూడా కోరారు. యూఎస్ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రిపబ్లికన్ అభ్యర్థిని శిక్షించడం జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేయడమేనని వాదించారు. దీంతో తీర్పును నవంబర్ 26న అమలు చేస్తామని మాన్‌హట్టన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చన్ తీర్పు చెప్పారు.

Advertisement

Next Story