- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.773 కోట్లకు చేరిన డీ-మార్ట్ లాభాలు
దిశ, బిజినెస్ బ్యూరో: డీ-మార్ట్ ఆధ్వర్యంలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ తాజాగా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ.773.8 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ. 658.8 కోట్ల నుండి 17.5 శాతం పెరగడం గమనార్హం. ఇదే సమయంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా సంవత్సరానికి ఆదాయం రూ.11,865.4 కోట్ల నుండి రూ.14,069.1 కోట్లకు చేరి 18.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన(ఎబిటా) ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,035.3 కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.1,221.3 కోట్లకు పెరిగింది.
అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎండీ నెవిల్లే నోరోన్హా మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆదాయం క్రమంగా పెరిగింది. అమ్మకాలు మెరుగ్గా ఉండటం వలన ఇది సాధ్యమైందని అన్నారు. ఈ త్రైమాసికంలో కొత్తగా 6 స్టోర్లను ప్రారంభించామని. దీంతో జూన్ 30, 2024 నాటికి మొత్తం స్టోర్‌ల సంఖ్య 371కి చేరుకుందని సీఈఓ తెలిపారు. మా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి, భవిష్యత్తు కోసం సామర్థ్యాన్ని పెంపొందించడంపై నిరంతరం కృషి చేస్తామని ఆయన చెప్పారు.