- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో రౌండ్ లేఆఫ్స్‌లో 2,500 మందిని తీసేసిన డిస్నీ!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ డిస్నీ మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. ఇప్పటికే రెండు దశల్లో 4,000 మంది ఉద్యోగుల లేఆఫ్స్ ప్రకటించిన సంస్థ తాజాగా మరో 2,500 కంటే ఎక్కువమందిని తీసేసింది. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులను తీసేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ తొలగింపుల వల్ల ఏయే విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం అయ్యారనే వివరాలను డిస్నీ ఇంకా వెల్లడించలేదు.
గతంలో కంపెనీ మొత్తం 7 వేల మందిని తీసేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతానికి మూడు రౌండ్లలో డిస్నీ 6,500 మందికి చేరుకుంది. గతేడాది అక్టోబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా డిస్నీలో 2,20,000 మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుత తొలగింపులు మొత్తం ఉద్యోగుల్లో 3 శాతానికి సమానం. లేఆఫ్స్ కారణంగా డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, డిస్నీ పార్క్స్ సహా వివిధ విభాగాలు ప్రభావితమయ్యాయి.