జూలైలో భారీగా పడిపోయిన డీజిల్ ఎగుమతులు.. పెరిగిన ధరలు..

by Javid Pasha |
జూలైలో భారీగా పడిపోయిన డీజిల్ ఎగుమతులు.. పెరిగిన ధరలు..
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది జూలైలో భారత డీజిల్ ఎగుమతులు 11 శాతం క్షీణించాయని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ఎగుమతులు నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ సుంకం నేపథ్యంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సమీక్షించిన నెలలో పెట్రోల్ ఎగుమతులు 4.5 శాతం పడిపోయాయని గణాంకాలు వెల్లడించాయి.

అంతకుముందు జూన్‌లో భారత్‌ను 24.5 లక్షల డీజిల్ ఎగుమతులు నమోదవగా, గత నెల ఇది 21.8 లక్షల టన్నులకు పడిపోయాయని చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ విభాగం పేర్కొంది. పెట్రోల్ ఎగుమతులు 11.6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు తగ్గిపోయాయి. అయితే, విమాన ఇంధనం(ఏటీఎఫ్) ఎగుమతులు 5.91 లక్షల టన్నుల నుంచి 5.83 లక్షల టన్నులకు పెరిగాయి.

ప్రభుత్వం జూలైలో అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన ధరల ద్వారా దేశీయ ఇంధన శుద్ధి కంపెనీలు పొందే అనూహ్య లాభాల నుంచి ఆదాయం సమకూర్చుకునేందుకు విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా లీటర్ డీజిల్, ఏటీఎఫ్‌పై రూ. 13 చొప్పున, లీటర్ పెట్రోల్‌పై రూ. 6 ఎగుమతి పన్ను విధించింది. ఆ తర్వాత ప్రతి పదిహేను రోజులకొకసారి ధరలను సమీక్షిస్తూ చివరగా ఈ నెల 19న పెట్రోల్‌పై 7, డీజిల్, ఏటీఎఫ్‌పై రూ. 2 చొప్పున పన్ను వసూలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed