- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండిగోలో ఇద్దరు పైలట్ల లైసెన్సులను సస్పెండ్ చేసిన డీజీసీఏ!
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంస్థలోని ఇద్దరు పైలట్ల లైసెన్సులను పరిశ్రమ నియంత్రణ సంస్థ డీజీసీఏ సస్పెండ్ చేసింది. గత నెల అహ్మదాబాద్ విమానాశ్రయంలో భద్రతా నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. విమానం ల్యాండింగ్ సమయంలో వెనక భాగం నేలను తాకిన ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
పైలట్-ఇన్-కమాండ్ ఫ్లయింగ్ లైసెన్స్ మూడు నెలలు, కో-పైలట్ ఒక నెల పాటు సస్పెండ్ చేసినట్లు డీజీసీఏ సీనియర్ అధికారి తెలిపారు. జూన్ 15న బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఇండిగో విమానం తోక భాగం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను తాకింది. దీనిపై డీజీసీఏ విచారణ చేపట్టగా, పైలట్లు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌కు భిన్నంగా వ్యవహరించారని తేలింది. దీనిపై పైలట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, వారి సమాధానం అనంతరం చర్యలు తీసుకుంది.