రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో పెరగనున్న వినియోగం: SBI రీసెర్చ్!

by Harish |   ( Updated:2023-06-19 14:05:08.0  )
రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో పెరగనున్న వినియోగం: SBI రీసెర్చ్!
X

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల దేశంలో వివిధ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ దిగ్గజ ఎస్‌బీఐ పరిశోధనా విభాగం ఎకోరాప్ సోమవారం ప్రకటనలో తెలిపింది. దాని ప్రకారం, రూ. 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవడం వల్ల బ్యాంకు డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, వినియోగం, ఆర్‌బీఐకి చెందిన రిటైల్ డిజిటల్ కరెన్సీ వినియోగం పెరుగుతుందని ఎస్‌బీఐ ఎకోరాప్ అభిప్రాయపడింది.

పెద్ద నోట్లు వెనక్కి తీసుకోవడం వల్ల ప్రధానంగా దేశంలో వినియోగ గిరాకీ తక్షణం పెరుగుతుందని ఎకోరాప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. రూ. 2 వేల నోటును రద్దు చేయకుండా ఉపసంహరించుకోవడంతో పాటు మార్పిడికి ఇచ్చిన గడువు తర్వాత కూడా చట్టబద్ధంగా చెల్లుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

ఇది కూడా వినియోగం పుంజుకునేందుకు దోహదపడుతుంది. దాంతో వినియోగ డిమాండ్ అధికంగా ఉండే, బంగారు ఆభరణాలు, ఏసీ, మొబైల్‌ఫోన్లు, రియల్టీ వంటి రంగాల్లో గిరాకీ పెరుగుతుందని నివేదిక వివరించింది. బ్యాంకులకు డిపాజిట్లు పెరిగి కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్‌ అకౌంట్‌(కాసా) రూ. 1.5 లక్షల కోట్లకు చేరవచ్చని ఎకోరాప్ అభిప్రాయపడింది.

Also Read...

SBI తర్వాత అరుదైన ఘనతను దక్కించుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా!

Advertisement

Next Story

Most Viewed