- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
15 కోట్లకు చేరిన డీమ్యాట్ ఖాతాలు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య కొత్త గరిష్ఠాలకు చేరాయి. ఈ ఏడాది మార్చి నాటికి భారత్‌లో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 15.1 కోట్లకు చేరాయి. కేవలం మార్చిలో మాత్రమే కొత్తగా 31 లక్షల ఖాతాలు ఓపెన్ అయినట్టు గణాంకాలు వెల్లడించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 31 లక్షల కొత్త ఖాతాలు తెరిచారని, ఈ ట్రెండ్ ఏడాది పొడవున కొనసాగినట్టు బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఆర్థికవ్యవస్థపై సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్లు తగ్గింపు ఆశలు, విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండటంతో పాటు మొత్తంగా అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో భారత ఈక్విటీల్లో పెట్టుబడులకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మోడీ ప్రభుత్వమే మూడోసారి కూడా కొనసాగుతుందనే అంచనాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచుతోంది. డేటా ప్రకారం, ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య నెలకు 1.8 శాతం పెరిగి మార్చి నాటికి 4.08 కోట్లకు చేరుకుంది. ఇక, అత్యధిక క్లయింట్లతో ప్రముఖ జెరోధా అగ్రస్థానంలో ఉంది. కొత్త ఇన్వెస్టర్లు స్వల్పంగానే పెరగడంతో మార్కెట్ వాటాలో జెరోధా కొంత వెనుకబడింది. ఆ తర్వాత అప్‌స్టాక్స్, గ్రో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.