- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లో 1 బిలియన్ డాలర్ల మార్కు దాటిన డైకిన్ ఇండియా!
చెన్నై: ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ డైకిన్ ఇండియా దేశీయ మార్కెట్లో కీలక 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,172 కోట్ల) టర్నోవర్ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్‌జీత్ జావా అన్నారు. వచ్చే మూడేళ్లలో దీన్ని రెట్టింపు చేస్తూ 2 బిలియన్ డాలర్లకు చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి డైకిన్ ఇండియా రూ. 8,860 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. భారత వ్యాపారాన్ని భవిష్యత్తు నిధిగా భావిస్తున్నామని, మరో మూడేళ్ల రూ. 16,350 కోట్లను సాధించగలమనే విశ్వాసం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 9,667 కోట్ల ఆదాయాన్ని సాధించిన టాటా గ్రూప్ వోల్టాస్ తర్వాత కూలింగ్ విభాగంలో 1 బిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న కంపెనీగా నిల్వడం గర్వంగా ఉంది. ముఖ్యంగా వివిధ రకాల రిఫ్రిజిరేటర్లు, రూమ్ ఏసీలతో సహా అన్ని విభాగాల్లో తాము గణనీయమైన అమ్మకాలను కలిగి ఉన్నామని కన్వల్‌జీత్ వివరించారు. ఇప్పటివరకు భారత మార్కెట్లో తాము రూ. 2,300 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఇక్కడి నుంచి మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.