Power: బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అదానీ పవర్

by Harish |   ( Updated:2024-08-15 15:38:25.0  )
Power: బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేసేందుకు కట్టుబడి ఉన్నాం: అదానీ పవర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: తీవ్ర అల్లర్లతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని అదానీ పవర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతి నిబంధనలకు ఇటీవల ప్రభుత్వం చేసిన సవరణ బంగ్లాదేశ్‌‌కు విద్యుత్‌ను అందించడానికి చేసుకున్న ఒప్పందాన్ని ప్రభావితం చేయదని పేర్కొంది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ డిమాండ్ షెడ్యూల్, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం విద్యుత్‌ను అందించడానికి అదానీ పవర్ కట్టుబడి ఉందని సంస్థ అధికారులు చెప్పారు.

నవంబర్ 2017లో, అదానీ పవర్ బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ (BPDB)తో 25 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA)పై సంతకం చేసింది. దీనిలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్ 1,600 మెగావాట్ల (MW) గొడ్డ ప్లాంట్ నుంచి విద్యుత్‌ను పొరుగు దేశానికి ఎగుమతి చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ ఎగుమతి విషయంలో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. అయితే ఈ సవరణల ద్వారా బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంస్థ పేర్కొంది. ఈ ప్లాంట్‌కు ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్ గనుల నుండి బొగ్గును సరఫరా చేస్తారు.

Advertisement

Next Story