CNG, PNG ధరల తగ్గింపు.. ఈ రోజు నుంచే అమల్లోకి

by Harish |   ( Updated:2023-04-08 02:54:15.0  )
CNG, PNG ధరల తగ్గింపు.. ఈ రోజు నుంచే అమల్లోకి
X

ముంబై: అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ టోటల్ గ్యాస్ CNG ధరను కిలోకు రూ. 8.13, PNG ధరను రూ.5.06 (క్యూబిక్ మీటర్‌కు) తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తగ్గించిన ఈ ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. అదానీ టోటల్ గ్యాస్ యాజమాన్యం మాట్లాడుతూ, మా వినియోగదారులకు ప్రాధాన్యత అందించడానికి ధరలు తగ్గించాము, భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త గ్యాస్ ధరల మార్గదర్శకాల ప్రయోజనాన్ని పెద్ద సంఖ్యలో గృహాలకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల నిపుణుల ప్యానెల్ సిఫార్సుల ఆధారంగా భారత క్యాబినెట్ కొత్త అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజంను తీసుకొచ్చింది. అంతకుముందు, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఏప్రిల్ 7న కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను కిలోకు రూ. 8 , పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరను రూ. 5(క్యూబిక్ మీటర్‌కు) తగ్గించింది.

Advertisement

Next Story