- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల తర్వాత మొదటిసారిగా పెరిగిన చైనా పారిశ్రామిక కార్యకలాపాలు
బీజింగ్: ఇటీవల కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. కరోనా ఆంక్షలు, రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి కారణాల వల్ల ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు కూడా మొదలు పెట్టింది. గత కొద్ది నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా చైనా పారిశ్రామిక కార్యకలాపాలు కొంత మేరకు పుంజుకున్నాయి. గత ఆరు నెలల నుంచి సెప్టెంబర్ నాటికి చైనా పారిశ్రామిక కార్యకలాపాలు మొదటిసారిగా పెరిగినట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం, ఆ దేశ ఉత్పత్తుల కొనుగోలు సూచిక (PMI) సెప్టెంబరులో 49.7 నుండి 50.2 కి పెరిగింది. సేవా రంగ కార్యకలాపాలు, నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ పీఎంఐ ఆగస్టులో 51.0 ఉండగా అది, ఇప్పుడు 51.7 కు చేరుకుంది. తయారీ, తయారీయేతర కార్యకలాపాల మిశ్రమ పీఎంఐ 51.3 నుండి సెప్టెంబర్‌లో 52.0 పెరిగినట్టు నివేదిక పేర్కొంది.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ కొంతవరకు గాడిన పడ్డట్టు కనిపిస్తుంది. రుణ రేట్లను తగ్గించడంతో సహా వృద్ధిని పెంచడానికి తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలిస్తున్నాయి. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ప్రభుత్వ వార్షిక వృద్ధి లక్ష్యమైన 5 శాతంకి చేరుకోవడానికి మరింత విధాన మద్దతు అవసరమని విశ్లేషకులు అంటున్నారు.