- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంపర్ ఆఫర్ ఇస్తోన్న కేంద్రం.. ఉచితంగా లక్ష రూపాయలు మీవే!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీని కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారత ప్రభుత్వం 2021 అక్టోబర్ 25 న ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ప్రారంభించింది. దీని కింద నమోదైన వారికి రూ. 5 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందిస్తారు.
అయితే ఇప్పుడు దీని ద్వారానే రూ. లక్ష గెలుచుకునే గొప్ప ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే.. కేంద్రం ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌కు సరిపడా లోగోను డిజైన్ చేయాలని ప్రజలను కోరింది. అద్భుతమైన లోగోను తయారుచేసి విజేతగా నిలిచిన వారికి ప్రభుత్వం లక్ష రూపాయలను బహుమతిగా అందిస్తుంది. లోగోను సబ్మిట్ చేయడానికి జనవరి 12 వరకే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ పోటీలో ఇప్పటి వరకు 970 కి పైగా లోగోలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. తయారు చేసిన లోగోను అధికారిక వెబ్‌సైట్ https://www.mygov.in/task/design-logo-pradhan-mantri-ayushman-bharat-health-infrastructure-mission/ లో సబ్మిట్ చేయాలి. ఈ పోటీలో గెలిచిన వారు ఎంచక్కా లక్ష రూపాయలు పొందవచ్చు.
Also Read..
- Tags
- Ayushman Bharath