కొత్త EV పాలసీకి ఆమోదం తెలిపిన కేంద్రం.. టెస్లాకు లైన్ క్లియర్

by Harish |
కొత్త EV పాలసీకి ఆమోదం తెలిపిన కేంద్రం.. టెస్లాకు లైన్ క్లియర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి గమ్యస్థానంగా మార్చడానికి కేంద్రం కొత్త EV పాలసీకి ఆమోదం తెలిపింది. దీంతో ప్రఖ్యాత గ్లోబల్ ఈవీ తయారీదారులు దేశంలో ఈవీలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మార్చి 15న జరిగిన సమావేశంలో కొత్త ఈవీ పాలసీకి పచ్చజెండా ఊపారు. కొత్త విధానం ప్రకారం, కంపెనీలు దేశంలో కనీసం రూ.4150 కోట్లు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. అలాగే, కంపెనీలు మూడేళ్లలోపు భారత్‌లో తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈవీల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలి.

3 ఏళ్లలో 25 శాతం, 5 సంవత్సరాలలో 50 శాతం స్థానికీకరణ సాధించాలి. నిబంధనలు పాటించిన కంపెనీలు మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి $35,000, అంతకంటే ఎక్కువ విలువైన వాహనాలపై 15 శాతం కస్టమ్స్ సుంకంతో సంవత్సరానికి 8,000 ఈవీలను దిగుమతి చేసుకోవచ్చు. ఈ కొత్త పాలసీ విధానం ద్వారా భారత్‌లో ఎప్పటి నుంచో కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తున్న టెస్లాకు మంచి అవకాశం లభించినట్లయింది. రాయితీల ద్వారా భారత్‌లోకి ప్రపంచవ్యాప్తంగా ఈవీ తయారీ కంపెనీలు క్యూ కడుతాయి. స్వదేశీ ఉత్పత్తి, ఆవిష్కరణలతో మేకిన్ ఇండియాను ప్రోత్సహించినట్లవుతుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed