- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఏడాది 9 శాతం పెరగనున్న సిమెంట్ గిరాకీ!
by Harish |
X
న్యూఢిల్లీ: కేంద్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ గిరాకీ గణనీయంగా పెరుగుతుందని ప్రముఖ ఇండియా రేటింగ్స్ సోమవారం ప్రకటనలో తెలిపింది. 2023-24లో సిమెంట్ డిమాండ్ 8-9 శాతం వృద్ధి చెందనుంది. ద్రవ్యోల్బణం ఒత్తిడి ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ మెరుగైన బ్యాలెన్స్ షీట్ ద్వారా లాభదాయకతను సాధించగలదని ఇండియా రేటింగ్స్ నివేదిక అభిప్రాయపడింది.
సిమెంట్ పరిశ్రమలో నిర్వహణ మార్జిన్‌ను మెరుగుపరచడంతో పాటు బొగ్గు, పెట్‌కోక్ వంటి ముడిసరుకుల వ్యయం కారణంగా కూడా తయారీ కంపెనీలు ఈ ఏడాది సింగిల్ డిజిట్‌లో ధరలను పెంచే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా వ్యవసాయ రంగం మద్దతు, సరసమైన ఇళ్ల ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పరిశ్రమకు కలిసి రానుందని నివేదిక పేర్కొంది.
Advertisement
Next Story