Canara Bank: భారం కానున్న కెనరా బ్యాంకు రుణాలు

by S Gopi |
Canara Bank: భారం కానున్న కెనరా బ్యాంకు రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు రుణాలు భారం కానున్నాయి. శుక్రవారం బ్యాంకు తన నిధుల ఆధారిత రుణ(ఎంసీఎల్ఆర్) రేటును 5 బేసిస్ పాయంట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వినియోగదారులు తీసుకునే రుణాల ఈఎంఐ మరింత ప్రియం కానున్నాయి. సాధారణంగా ఎంసీఎల్ఆర్ ఆధారంగానే ఆటో, పర్సనల్ లోన్‌లపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు. తాజా పెంపుతో బ్యాంకు ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 8.95 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది. అలాగే, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 9.40 శాతం, రెండేళ్ల కాలానికి 5 బేసిస్ పాయింట్లు పెంచి 9.30 శాతంగా ఉంటుంది. మిగిలిన కాలవ్యవధుల్లో నెల, మూడు నెలల, ఆరు నెలల కాలవ్యవధులపై 8.35-8.80 శాతం పరిధిలో ఉంది. ఓవర్‌నైట్ కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్‌ను 8.20 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. సవరించిన రేట్లు ఆగష్టు 12 నుంచి అమల్లోకి రానున్నట్టు కెనరా బ్యాంకు వెల్లడించింది. తాజాగా ఆర్‌బీఐ కీలక రెపో రేటును వరుసగా తొమ్మిదోసారి 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకు రేట్లను సవరించింది.

Advertisement

Next Story