- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
PF డబ్బును హోమ్‌లోన్ చెల్లించడానికి వాడొచ్చా..? లేదా..?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో మాంద్యం భయాల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వరుసగా రేపో రేటును ఐదుసార్లు పెంచింది. దీంతో ఈ భారాన్ని తగ్గించుకోడానికి బ్యాంకులు, వినియోగదారులు తీసుకునే గృహ రుణ రేట్ల పై వడ్డీ రేటును భారీగా పెంచాయి. ప్రస్తుతం భారంగా ఉన్న హోమ్‌లోన్స్‌ను క్లియర్ చేయడానికి లోన్ తీసుకున్నవారు నానాతంటాలు పడుతున్నారు. కొంతమంది ఈ బాధ నుంచి ఎలాగైనా గట్టెక్కడానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు. అయితే ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉద్యోగ భవిష్య నిధి(EPF)లో ఉన్న తమ డబ్బులను హోమ్‌లోన్ చెల్లించడానికి వినియోగించాలనే ఆలోచన కూడా ఉంటుంది. అలా పీఎఫ్ డబ్బును హోమ్ లోన్ చెల్లించడానికి వాడొచ్చా..? లేదా..? అలా చెల్లిస్తే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి.. తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..
హోమ్‌లోన్‌కు పీఎఫ్ డబ్బును వాడవచ్చా..
ఉద్యోగ భవిష్య నిధిలో ఖాతా కలిగిన వ్యక్తి తన ఇంటి రుణ భారాన్ని తగ్గించుకోడానికి పీఎఫ్ డబ్బును ఉపయోగించవచ్చు. కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా హోమ్‌లోన్ చెల్లింపులకు అతని పేరు మీద ఈ ఇల్లు రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ ఇతరుల భాగస్వామ్యంతో ఇంటిని తీసుకున్నట్లయితే, అందులో అతని భాగస్వామ్యాన్ని నిరూపించే పేపర్లు ఉండాలి. ఇంకా పది సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా డబ్బును పీఎఫ్‌లో జమ చేయాలి.
పీఎఫ్ డబ్బును హోమ్‌లోన్‌కు వాడటం వలన లాభామా..? నష్టమా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పీఎఫ్ డబ్బును హోమ్‌లోన్‌కు చెల్లించడానికి వాడటం వలన కొంత మేరకు నష్టమే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ప్రతినెలా కొంత అమౌంట్‌ను ఉద్యోగ భవిష్య నిధిలో జమ చేయడం వలన అది ఉద్యోగ విరమణ లేదా వయసు పైబడిన తర్వాత ఎంతో ఆసరాగా ఉంటుంది. పైగా వడ్డీ రూపంలో కూడా వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది. పీఎఫ్ డబ్బును తీసుకోవడం వలన భవిష్యత్తు అవసరాలకు నష్టంగా ఉంటుందని వారి అభిప్రాయం.
ఎప్పుడు పీఎఫ్ డబ్బును వాడవచ్చు..
హోమ్ లోన్‌పై వడ్డీ రేటు అధికంగా ఉన్నప్పుడు వినియోగదారులు పీఎఫ్ డబ్బును వాడవచ్చు. ముఖ్యంగా పీఎఫ్‌పై వస్తున్న వడ్డీ రేటు హోమ్ లోన్‌పై వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటే పీఎఫ్ డబ్బును ఉపయోగించవచ్చు. ఒకవేళ రెండు వడ్డీ రేట్లు సమానంగా ఉన్నప్పుడు మాత్రం వేరే ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం. అదే విధంగా దీర్ఘకాలికంగా హోమ్‌లోన్ కట్టడానికి ఇబ్బందిపడుతున్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బును వాడవచ్చు. కొన్ని సార్లు ఈ విధంగా చేయడం వలన హోమ్ లోన్ బాధ తీరిపోయి. ఆ ఇంటి తాలూకు వాయిదాల భారం తగ్గుతుంది.
ప్రస్తుత రోజుల్లో రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతున్న క్రమంలో ఆ ఇంటి విలువ పీఎఫ్ డబ్బు కంటే వేగంగా పెరుగుతుంది. పైగా ఇంటి అద్దె రూపంలో వచ్చే డబ్బును మళ్ళీ పెట్టుబడి పెట్టవచ్చు. కానీ ఇది అన్ని సార్లు ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కాబట్టి వినియోగదారులు అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ డబ్బును తీయకూడదని నిపుణులు ముఖ్యంగా పేర్కొంటున్న అంశం. ఈ చెల్లింపుల కోసం ఇతర మార్గాలను అన్వేషించడం ఉత్తమం అని వారు పేర్కొంటున్నారు.