- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైజూస్‌పై కొనసాగుతున్న ఆరోపణలు!
బెంగళూరు: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌పై ఆరోపణలు కొనసాగుతున్నాయి. రుణాలిచ్చినవారు, బైజూస్ సంస్థ ఓ హెడ్జ్‌ఫండ్‌లో వ్యూహాత్మకంగానే 533 మిలియన్ డాలర్ల నిధులను రహస్యంగా ఉంచిందని ఆరోపించారు. ఈ మేరకు అమెరికాలోని ఓ కోర్టులో రుణదాతలు వ్యాజ్యం వేసినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. రుణాల ఎగవేత వ్యవహారంలో వసూళ్ల నిమిత్తం ఆ నిధులను తీసుకోకుండా బైజూస్ ఈ వ్యూహాన్ని అనుసరించిందన్నారు.
బైజూస్‌కు చెందిన అమెరికాలో కార్యకలాపాలు సాగించే ఆల్ఫా కంపెనీ 500 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని క్యామ్‌షాఫ్ట్ కేపిటల్ ఫండ్‌కు బదిలీ చేసింది. తామిచ్చిన 1.2 బిలియన్ డాలర్ల నిధులకు 533 మిలియన్ డాలర్లు తనఖా కిందకు వస్తాయని, వాటిని నియంత్రించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని రుణదాతలు కోర్టును అభ్యర్థించారు.
ఇదే సమయంలో బైజూస్ సంస్థ ఈ నిధులను నిబంధనలకు అనుగుణంగానే బదిలీ చేసినట్లు చెబుతోంది. రుణాల కింద పొందిన నిధులను ఇతర ఫండ్లకు బదిలీ చేయకూడదని రుణదాతలతో జరిగిన ఒప్పందంలో లేదని పేర్కొంది.
- Tags
- byjus
- Telugu News